రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా, రేపు నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలు సహా ఐటీ ఆఫీసులకు కూడా సెలవు ప్రకటించారు. కలెక్టర్ హరిచందన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సంఘం (ఈసీ) పోలింగ్‌కు సర్వం సిద్ధం చేసింది. ఈ హై-ప్రొఫైల్ పోరులో భద్రతకు పెద్దపీట వేస్తూ.. డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేయనున్నారు. 2060 మంది ఎన్నికల సిబ్బంది, 2000 మంది పోలీసు సిబ్బంది మోహరించనున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేయడానికి, ఎలాంటి అవాంతరాలు లేకుండా ఎన్నికలు పూర్తి కావడానికి ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఓటర్ల సమస్యల కోసం 1950 హెల్ప్‌లైన్ అందుబాటులో ఉంటుంది.