సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీవీ సునీల్ కుమార్‌ను సర్వీస్ నుంచి రిలీవ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. సునీల్ కుమార్ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రేపటితో (జూన్ 30వ తేదీ) సునీల్ కుమార్ వయోపరిమితి పూర్తి కానుండగా.. ఆయనను విధుల నుంచి రిలీవ్ చేస్తూ సోమవారం ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే పీవీ సునీల్ కుమార్ మీద ఉన్న ఆరోపణలపై ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. పీవీ సునీల్ కుమార్ మీద పెండింగ్‌లో ఉన్న శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు, కేసుల విచారణలు కొనసాగనున్నాయి.