సీఎం రేవంత్ రెడ్డి అపరిపక్వ వైఖరితో తెలంగాణ ప్రగతి మసకబారిందని మాజీమంత్రి హరీశ్ రావు విమర్శించారు. అశాంతి, అలజడితో రాష్ట్రం అట్టుడుకుతున్నదని ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ‘ఏడాది పాలన-ఎడతెగని వంచన’ పేరుతో బీఆర్‌ఎస్ ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. గాంధీభవన్‌లో వచ్చే సూచనల ఆధారంగా రేవంత్ చట్టాలు చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ఆఖరికి దేవుళ్లను కూడా మోసం చేశాడని.. అందుకే భూకంపం వచ్చిందని తనతో కొందరు అనట్లు చెప్పారు.