తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. రైతుభరోసా అంశంపై సభలో నేడు ఉదయం చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిని ఏక వచనంతో సంభోదించారు. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సభా మర్యాదలు ఫాలో అవ్వాలని సభా నాయకుడిని అలా పిలవటం సరైంది కాదని అన్నారు. స్పీకర్ సూచనపై స్పందించిన కేటీఆర్ మర్యాద, గౌరవం ఇచ్చి పుచ్చుకుంటే వస్తుందని.. తానేమీ చెడు మాటలు మాట్లాడలేదని అన్నారు.