తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై సీనియర్ నటుడు సుమన్ ప్రశంసల జల్లు కురిపించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాలు మహాధర్నా నిర్వహించగా.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు నటుడు సుమన్ కూడా హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సుమన్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ప్రశంసల జల్లు కురిపించారు. రేవంత్ రెడ్డి రియల్ హీరో అంటూ ఆయనను సుమన్ ఆకాశానికెత్తేశారు.