తెలంగాణ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యుల సంఖ్యను కోటికి పెంచడానికి వినూత్న చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 65.44 లక్షల మంది సభ్యులు ఉండగా.. 60 ఏళ్లు పైబడిన, దివ్యాంగులైన మహిళలతో ప్రత్యేక SHGలను ఏర్పాటు చేయనుంది. ఆసరా పింఛను పొందుతున్న 4.89 లక్షల మంది వృద్ధ మహిళలు, 1.97 లక్షల మంది దివ్యాంగ మహిళలతో కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది దేశంలోనే తొలిసారి. ఈ పథకం మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక భాగస్వామ్యం బలోపేతం చేస్తుంది.