తెలంగాణ ప్రభుత్వం చిన్నారులలో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వినూత్న కార్యాచరణ చేపట్టింది. ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా 3 నుంచి 6 ఏళ్ల లోపు పిల్లలకు రోజూ సాయంత్రం అంగన్‌వాడీ కేంద్రాల్లో గోరువెచ్చని పాలు అందించనున్నారు. ఈ పథకం ద్వారా 7,918 మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది.