సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో చనిపోయిన రేవతి కుటుంబ బాధ్యత కోసం చర్యలు తీసుకున్నట్లు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలిపారు. కిమ్స్ ఆస్పత్రిలో గత 20 రోజులుగా చికిత్స పొందుతున్న శ్రీతేజ్ భవిష్యత్ కోసం ఆర్థిక సాయం ప్రకటించినట్లు తెలిపారు. మొత్తంగా శ్రీతేజ్ కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు.. రూ.2 కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇందులో అల్లు అర్జున్ రూ.1 కోటి.. డైరెక్టర్ సుకుమార్ రూ.50 లక్షలు.. మైత్రీ మూవీస్ సంస్థ రూ.50 లక్షలు.. ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ -ఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్‌రాజుకు అందించినట్లు అల్లు అరవింద్ స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని చెప్పిన అల్లు అర్జున్.. కళ్లు తెరుస్తున్నాడని పేర్కొన్నారు.