రేషన్ కార్డు ఉంటే మీ ఇంటికే చీర.. 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు అందజేస్తాం: మంత్రి పొన్నం

3 months ago 8
తెలంగాణలో మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా కోహెడలో ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందించి, వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యమని ఆయన ప్రకటించారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు ఇస్తున్నామని తెలిపారు. త్వరలో ప్రతి మండలానికి క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.అయితే.. క్షేత్ర స్థాయిలో మహిళా సంఘాల సభ్యులకే చీరలు ఇస్తుండటం వలన.. రేషన్ కార్డు ఉన్నప్పటికీ కొందరు అర్హులకు అందక గందరగోళం నెలకొంది. పంపిణీ పారదర్శకంగా జరగాలని మహిళలు కోరుతున్నారు.
Read Entire Article