తెలంగాణలో కొత్తగా రేషన్ కార్డులు పొందినవారితో పాటు పాత లబ్ధిదారులు కూడా తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని సిద్దిపేట జిల్లా అధికారిణి తనుజ తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే రేషన్ కోటా తగ్గిపోవడం లేదా కార్డు రద్దు కావచ్చని హెచ్చరించారు. జిల్లాలో 72.33% మంది మాత్రమే ఇప్పటివరకు ఈ-కేవైసీ పూర్తి చేశారు. 3.26 లక్షల కార్డుల్లో 7.35 లక్షల లబ్ధిదారులు కేవైసీ చేసుకోగా, 28% మంది ఇంకా చేయలేదు. లబ్ధిదారులు వెంటనే ఈ-పోస్ యంత్రం ద్వారా కేవైసీ పూర్తి చేయాలని సూచించారు.