ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండగా.. కొందరు లబ్ధిదారులు, డీలర్లు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారు. దొడ్డు బియ్యం పంపిణీలో మొదలైన ఈ అక్రమాలు.. సన్న బియ్యం పంపిణీలోనూ కొనసాగుతున్నాయి. లబ్ధిదారులు బియ్యాన్ని దళారులకు అమ్ముకుంటున్నారు. అధికారులు అక్రమాలకు పాల్పడిన లబ్ధిదారుల రేషన్ కార్డులను రద్దు చేస్తున్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.