తెలంగాణలో ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ నేటితో ముగియనుంది. గోదాముల్లో అధిక నిల్వలు, వాతావరణ పరిస్థితులపై అంచనాలు, సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం మూడు నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేస్తుంది. దీంతో రేషన్ షాపుల వద్ద గత నెల రోజులుగా రద్దీ నెలకొంది. ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. ఇంకా తీసుకోని కార్డుదారులు నేటి సాయంత్రంలోపు బయోమెట్రిక్ ధ్రువీకరణతో కోటాను పొందాలని అధికారులు సూచించారు.