రంగారెడ్డి జిల్లాలోని మాడ్గుల మండలంలో రైతులు నిల్వ ఉంచిన పత్తిని దొంగలు అపహరించుకుపోతున్నారు. ఇటీవల వరుసగా జరిగిన ఈ చోరీలలో.. ఒకే రైతు పొలం నుండి ఏకంగా ఎనిమిది క్వింటాళ్ల పత్తి మాయమైంది. ఈ ఘటనలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ.. దర్యాప్తులో వేగం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాపాడి, రైతులకు న్యాయం చేయాలని మండల రైతాంగం పోలీసు ఉన్నతాధికారులను కోరుతున్నారు.