రైతు డిస్కంకు లైన్‌ క్లియర్‌.. త్వరలోనే ఈఆర్‌సీ నుంచి లైసెన్స్ జారీ..!

2 months ago 12
రాష్ట్రంలో వ్యవసాయ, ఎత్తిపోతల, ప్రభుత్వ నీటి సరఫరా పథకాలకు నిరంతర విద్యుత్‌ను అందించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న రైతు డిస్కం ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. దీనికి అవసరమైన లైసెన్స్ జారీ చేసేందుకు రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి తుది కసరత్తు చేస్తోంది. అభ్యంతరాలు, సలహాల స్వీకరణ గడువు ముగియడంతో వాటిని పరిశీలించి త్వరలో అధికారిక ఉత్తర్వులు ఇవ్వనుంది. ప్రస్తుతమున్న ఉత్తర, దక్షిణ డిస్కంల నుంచి వ్యవసాయ, మిషన్ భగీరథ కనెక్షన్లను తొలగించి రైతు డిస్కంకు బదిలీ చేస్తారు. సచివాలయం వెనుక నిర్మిస్తున్న రెడ్కో భవనంలో ఈ సంస్థ కేంద్ర కార్యాలయం త్వరలోనే ప్రారంభం కానుంది.
Read Entire Article