రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దసరా రోజున పథకాన్ని ప్రారంభించి అన్నదాతల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు సమాచారం. రేపు జరిగే కేబినెట్ భేటీలో పథకం అమలుపై చర్చించి ఆ తర్వాత విధివిధానాలపై అధికారిక ప్రకటన వెలువరించనున్నారు.