తెలంగాణ రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు మంత్రి వివేక్ వెల్లడించారు. రైతు భరోసా పథకం కింద.. రైతుల ఖాతాల్లోకి రూ.9 వేల కోట్లు అందజేస్తామని తెలిపారు. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని తెలిపిన మంత్రి వివేక్.. సన్న వడ్లు పండించే రైతులకు బోనస్ చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు.