తిరుమల శ్రీవారి మెట్లపై సిగరెట్ తాగిన వ్యక్తి.. పోలీసులకు టీటీడీ ఫిర్యాదు

1 day ago 1
తిరుమల పరిధిలో మద్యపానం, ధూమపానం, మత్తు పదార్థాలు సేవించడం నేరం. కానీ, ఓ వ్యక్తి శ్రీవారి మెట్ల మార్గంలో సిగరెట్ తాగుతూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెట్ల మార్గంలో ఓ వైపు కూర్చుని సిగరెట్ తాగడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తిరుమల తిరుపతి దేవస్థానం కూడా స్పందించింది. సదరు వ్యక్తిపై టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని శ్రీవారి భక్తులు కోరుతున్నారు.
Read Entire Article