తెలంగాణలో రైతు భరోసా పథకం కింద 9 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు నిధులు విడుదలయ్యాయి. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకారం.. గత ఆరు రోజుల్లో 66.19 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 7,770.83 కోట్లు జమ అయ్యాయి. 8 ఎకరాలకు రూ. 265.91 కోట్లు, 9 ఎకరాలకు రూ. 194 కోట్లు విడుదలయ్యాయి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న సాగుకు పనికిరాని భూములకు సాయం నిలిపివేశారు. మిగిలిన 1.20 లక్షల ఎకరాలకు 2-3 రోజుల్లో నిధులు జమ అవుతాయని మంత్రి చెప్పారు.