రైతు వేదికల్లో సన్న వడ్ల విత్తనాలను అందుబాటులో ఉంచాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యాప్‌లలో బుక్ చేసుకున్న యూరియాను కూడా రైతు వేదికల్లోనే అన్నదాతలకు అందించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే 7 రకాల సన్న వడ్లను రైతులకు సబ్సిడీపై అందించాలని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. వరి సాగు చేసే రైతుల వివరాలను అధికారులు తప్పకుండా సేకరించాలని వెల్లడించారు.