ఏపీ రైతులకు ముఖ్య గమనిక. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నమోదు గడువును పొడిగించారు. ఆగస్ట్ 15వ తేదీతో బీమా ప్రీమియం చెల్లింపు గడువు పూర్తి అయ్యింది. అయితే చాలా మంది రైతులు ఇంకా పంటల బీమా నమోదు చేసుకోని కారణంగా.. ఆగస్ట్ 31వ తేదీ వరకూ గడువు పొడిగించారు.ఈ నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని.. తమ పంటలను బీమా చేయించుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు కోరారు.