అర్హతలు ఉన్నా రైతు రుణమాఫీ కానీ రైతులకు మంత్రి తుమ్మల గుడ్‌న్యూస్ చెప్పారు. వారి అకౌంట్లలో త్వరలోనే రైతు రుణమాఫీ డబ్బులు జమ చేయనున్నట్లు వెల్లడించారు. ఈనెల 30న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమని.. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.