రైతులకు మరిన్ని సేవలు.. అన్నీ ఒకేచోట.. మన గ్రోమోర్ ప్రారంభం..

4 months ago 16
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో రైతులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో కోరమాండల్ సంస్థకు చెందిన 'మన గ్రోమోర్' వ్యాపార కేంద్రాన్ని ప్రారంభించారు. వ్యవసాయ శాఖ అధికారి సాయి కిరణ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. గ్రోమోర్ అధికారులు మాట్లాడుతూ.. తమ కేంద్రం ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, సాంకేతిక సలహాలతో సహా వ్యవసాయానికి అవసరమైన అన్ని సేవలు అందిస్తామని తెలిపారు. ఈ కేంద్రం వల్ల పంట దిగుబడిని పెంచుకునేందుకు రైతులకు సహాయం లభిస్తుంది.
Read Entire Article