తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న రైతు భరోసా పథకం అమలుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అమలైన రైతుబంధులో జరిగిన అవకతవకలు.. రైతు భరోసాలో దొర్లకుండా ఉండాలన్న భావనతో.. రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. అయితే.. ఇప్పటికే విధివిధానాలపై కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.. త్వరలోనే అమలు చేయాలని యోచిస్తోంది. కాగా.. రెండు దఫాలుగా రైతుల ఖాతాల్లో జమచేయాల్సిన డబ్బులను ఇప్పుడు ఒకేసారి వేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.