వ్యవసాయం రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఎద్దులు, దున్నల సాయంతో దుక్కి దున్ని చదునుచేసేవారు. ప్రస్తుతం మాత్రం వాటి స్థానంలో ట్రాక్టర్లు వచ్చి చేరాయి. అలాగే, ఆధునిక సాంకేతికతను వ్యవసాయానికి జోడిస్తున్నారు. ముఖ్యంగా డ్రోన్ల సాయంతో రసాయనాలు స్ప్రే చేస్తున్నారు. వ్యవసాయ యాంత్రీకరణపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. రైతులకు ఉపయోగపడే 20 రకాల సాగు సామాగ్రిని అందజేయనుంది. వీటికి కొంత మొత్తం సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వనుంది.