AP Government Input Subsidy: ఎర్రకాలువ ముంపునకు గురై నష్టపోయిన రైతులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది జులైలో ఎర్రకాలువ పొంగిపొర్లిన సంగతి తెలిసిందే. ఎర్రకాలువ ఉద్ధృతి కారణంగా గోదావరి జిల్లాల్లోని 20 మండలాల రైతులు నష్టపోయారు. సుమారుగా నాలుగున్నర వేలమంది రైతులు పంట నష్టపోయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు గానూ వీరికి ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వరి పంట నష్టపోయిన రైతులకు హెక్టారుకు రూ.17000 ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.