తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. అకౌంట్లలో డబ్బులు జమయ్యాయి చూసుకోండి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న (జనవరి 26) రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. అర్హులైన రైతుల అకౌంట్లలోకి ఈరోజు రైతు భరోసా డబ్బులు జమ చేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది. అయితే.. అందరికీ కాందండోయ్.. నిన్న ప్రారంభించిన గ్రామాల్లోని లబ్ధిదారుల అకౌంట్లలో మాత్రం ఈ డబ్బులు జమయ్యాయి.