Janmabhoomi Express Timings Changed: జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే ఈ రైలు వేళలు మారాయి. ఫిబ్రవరి 15, 2026 నుంచి కొత్త ప్రయాణ సమయాలు అమల్లోకి వస్తాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే, సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని కొన్ని వారంతపు రైళ్లను కూడా పొడిగించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని రైల్వే శాఖ సూచించింది.