రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రయాణికుల సౌకర్యం, డిమాండ్ నేపథ్యంలో విజయవాడ - లింగంపల్లి- విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ రైళ్లకు శాశ్వత ప్రాతిపదికన అదనపు బోగీలు అమర్చనున్నట్లు విజయవాడ రైల్వే డివిజనల్ కార్యాలయంలో ఓ ప్రకటనలో తెలిపింది. విజయవాడ లింగంపల్లి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు ఒక 3AC ఎకానమీ కోచ్.. అలాగే లింగంపల్లి విజయవాడ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలుకు మరో 3AC ఎకానమీ కోచ్ ఏర్పాటు చేయనున్నారు. జూలై 26, 27 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.