రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన మహిళ.. ఆ రూట్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం..

8 months ago 16
శంకర్‌పల్లి లింగంపల్లి మధ్య రైల్వే ట్రాక్‌పై ఒక మహిళ కారుతో విన్యాసాలు చేసి కలకలం రేపింది. ఈ చర్య రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగించి, ప్రయాణికులకు ఇక్కట్లు తెచ్చిపెట్టింది. బెంగళూరు నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే రైళ్లు నిలిచిపోయాయి. ప్రత్యక్ష సాక్షులు వీడియోలు తీశారు. ఆమె అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగగా, పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Read Entire Article