రైల్వే ప్రయాణికులకు గమనిక. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జనవరిలో 16 రైళ్లు రద్దు అయ్యాయి. గోదావరి- రాజమండ్రి, రాజమండ్రి- కడియం సెక్షన్లలో ఆధునికీకరణ నిర్మాణ పనులు చేపట్టిన నేపథ్యంలో ఈ రైళ్లను రద్దు చేశారు. ఈ మేరకు వాల్తేరు సీనియర్ డీసీఎం కె పవన్ కుమార్ వివరాలు తెలిపారు. ప్రయాణికులు తమ ప్రయాణాలను మార్చుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.