భార్యాభర్తలు రోజంతా తమ గ్రామంతో పాటు మండలంలోని ఇతర గ్రామాల్లో బైక్‌పై తిరిగేవారు. భార్యాభర్తలు అలా వీధుల్లో విహరించడం మంచిదే కదా.. అనుకుంటున్నారా. అయితే పప్పులో కాలేసినట్లే. వారు తిరిగిది.. షికారు కోసం కాదు. ఇళ్లకు కన్నాలేసే పని కోసం. ఏయే ఇళ్లకు తాళాలు వేశారు, వారు ఊళ్లోనే ఉన్నారా, బయటకు వెళ్లారా.. ఎప్పుడొస్తారు అనే వివరాలను రెక్కీ చేసి సేకరించేవారు. తర్వాత పక్కా ప్రణాళికతో చోరీకి పాల్పడేవారు. వీరు పోలీసులు ఎలా చిక్కారంటే?