గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని జాలిగామ బైపాస్ సమీపంలో చోటు చేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, కానిస్టేబుళ్ల మృతిపై మాజీమంత్రి హరీష్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.