ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. రోడ్డు ప్రమాదంలో యువతి చనిపోయిన ఘటనలో లింగమనేని రమేష్ తనయుడు సంజూష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్ట్ 16వ తేదీన హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 26 ఏళ్ల భారతి అనే యువతి చనిపోయింది. ఇనార్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పనిచేస్తున్న భారతీ ముఖీ.. రోడ్డు దాటుతున్న సమయంలో ఆస్టన్ మార్టిన్ కారు భారతిని ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. లింగమనేని సంజూష్ నిర్లక్ష్యం, అజాగ్రత్తతో కూడిన డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగిందంటూ మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.