రోడ్లపై పశువులను విడిచిపెట్టే వారికి అలర్ట్.. ఒక్క ఆవుకు నెలకు రూ.300 చొప్పున..

8 months ago 21
మంథని పట్టణంలో రోడ్లపై తిరుగుతున్న పశువుల సమస్యను పరిష్కరించేందుకు మున్సిపల్ కమిషనర్ ఎన్. మనోహర్ కీలక ప్రకటన చేశారు. కపిల గోశాలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. యజమానులు తమ ఆవులను గోశాలలో ఉంచాలనుకుంటే నెలకు 300 రూపాయలు చెల్లించి సంరక్షించుకోవచ్చు. ఒకవేళ పశువుల భారం భరించలేమనుకుంటే వాటిని గోశాలకు ఉచితంగా అప్పగించవచ్చు. గోశాల సంరక్షణలో ఉన్న ఆవు చనిపోతే దానికి బదులుగా మరొక ఆవును తిరిగి ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ నిబంధనలు పాటించకుండా పశువులను రోడ్లపైకి వదిలే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.
Read Entire Article