రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి ఎమ్మార్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఓ రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. ఎమ్మార్వోతో పాటు వీఆర్ఏను కూడా ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఈ వార్త మండలంలో హాట్ టాఫిక్‌గా మారగా.. ఎమ్మెర్వో అరెస్టుతో రైతులు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు.