మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ శాఖలో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంక్ అంతర్గత తనిఖీలలో భాగంగా రూ. 4 కోట్ల అవకతవకలు బయటపడ్డాయి. ఈ ఘటనలో ప్రధాన అనుమానితుడైన క్యాషియర్ పరారీలో ఉన్నాడు. ఇలాంటి మోసాలు పెరగకుండా బ్యాంకులు, కస్టమర్లు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. బ్యాంకులు నిరంతర తనిఖీలు, సాంకేతిక భద్రతను మెరుగుపరచాలి. కస్టమర్లు తమ ఖాతా వివరాలను తరచూ తనిఖీ చేసుకుంటూ.. పిన్‌లు, వన్ టైం పాస్ వర్డ్స్ ఎవరితోనూ పంచుకోకూడదు.