సంపాదించిన డబ్బును.. ఇంట్లో బీరువాళ్లోనో, ట్రంకు పెట్టేల్లోనో ఇలా ఎక్కడ పెట్టుకున్నా.. ఏ దొంగ ఎప్పుడు వచ్చి ఎత్తుకుపోతాడోనన్న భయం ఉంటుంది. కానీ బ్యాంకుల్లో దాచుకుంటే తమ డబ్బులు ఎక్కడికీ పోవని.. భద్రంగా ఉంటాయని.. ప్రజలంతా నిశ్చింతగా ఉంటారు. అలాంటిది.. ఆ బ్యాంకులే ఖాతాదారుని ఖాతాను ఖాళీ చేస్తే ఇంకేమైనా ఉందా..? అచ్చంగా అలాంటి ఘటనే జరిగింది హైదరాబాద్ బేగంపేటలోని ఓ ప్రైవేటు బ్యాంకులో. ఏకంగా 6.5 కోట్లు మింగేయటం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.