లక్కీడ్రా తీసిన చిన్నోడు.. ఇందిరమ్మ ఫ్లాట్ అతడి ఫ్యామిలీకే.. అదృష్టమంటే ఇదేనేమో..!

3 hours ago 2
హైదరాబాద్‌ ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపు లక్కీడ్రాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మైలార్‌దేవుపల్లి పరిధిలో ఓ బాలుడితో లక్కీడ్రా టోకెన్‌ తీయించగా.. అదే టోకెన్‌ అతడి కుటుంబానికే రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. జరపుల లక్ష్మీ కుటుంబానికి సొంతింటి అదృష్టం దక్కింది. ఈ ఘటనను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు. 16 నియోజకవర్గాల్లో 8 వేల ఫ్లాట్లకు లక్కీడ్రా నిర్వహిస్తున్న ప్రభుత్వం.. పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తోంది.
Read Entire Article