శంషాబాద్ సమీపంలో వెటర్నరీ డాక్టర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనమైంది. గ్యాంగ్ రేప్ చేసి, హత్య చేసిన తర్వాత పెట్రోల్ పోసి తగులబెట్టడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. తమ కుమార్తె హత్యకు గురైందని తెలిసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన బాధితురాలి తల్లి.. రాత్రి 10 గంటలకు అనుమానం వచ్చిందన్నారు. 10.30 నుంచి టెన్షన్ ఎక్కువైందన్న ఆమె.. చిన్నకూతురితో కలిసి తన కుమార్తెను వెతకడానికి వెళ్లామన్నారు.