హైదరాబాద్ ఫార్ములా ఈ-రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు వెళ్లారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో జరిగిన రేసులో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఉదయం 10 గంటల సమయంలో కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే తన లీగల్ టీంను పోలీసులు లోపలికి అనుమంతించకపోవటంపై కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. తాను న్యాయవాదితో విచారణకు హాజరవుతానని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం తన స్టేట్‌మెంట్‌ను రాతపూర్వకంగా ఏఎస్పీకి ఇచ్చి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.