లింగాల కేదారి-పుష్పలత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం.. సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

1 month ago 10
హనుమకొండకు చెందిన లింగాల కేదారి-పుష్పలత దంపతుల కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. సాధారణ హోటల్ నిర్వహిస్తూ ఉద్యమకారులు, విద్యార్థులకు ఉచితంగా భోజనం, అల్పాహారం, టీ, కాఫీ అందించిన ఈ దంపతులు.. ఆహారాన్ని వృథా చేయకూడదనే సందేశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో కేదారి మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరుసటి రోజు పుష్పలత కన్నుమూశారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి రూ.10 లక్షల సాయం సీఎం ప్రకటించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో మానవతా సేవలతో వీరు గుర్తింపు పొందారు.
Read Entire Article