తెలంగాణలో మహిళా అఘోరీ గత కొద్ది రోజులుగా హల్చల్ చేస్తోంది. వరుసగా ఆలయాలను దర్శించుకోంటోన్న అఘోరీ.. తాజాగా వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని శ్రీ కొమ్మాల లక్షీ నరసింహ స్వామి ఆలయానికి వెళ్లింది. దీంతో ఆమెను చూసేందుకు స్థానికులు అక్కడికి గుంపులుగా గుంపులుగా చేరుకున్నారు. ఈ క్రమంలో వారందరినీ చూసి అఘోరి అసహనం వ్యక్తం చేసింది. ఓ వృద్ధుడు ఆమెతో వాగ్వాదానికి దిగారు... అఘోరీ అంటూ అందర్నీ మోసం చేస్తున్నావంటూ గ్రామస్థులు కేకలు వేశారు. అంతేకాదు, 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు వెళ్లకుండా ఇక్కడ ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. సాధువులు, నాగ సాధువులు అందరూ అక్కడికి వెళ్తుంటే, నువ్వు వెళ్లలేదా? అని అనడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అఘోరీ.. కారు అద్దాలు పగులకొట్టడానికి వెళ్లింది. ఈ సమయంలో ఆపేందుకు వెళ్లిన వృద్ధుడిని కొట్టడానికి వెళ్లింది. పెట్రోల్ పోయడానికి యత్నించింది. స్థానికులు ఆమెను నకిలీ అఘోరివని గట్టిగా అరిచారు..