పుష్ప అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అనే డైలాగ్ పుష్ప-2 సినిమాలో ఎంతగా సరిపోయిందో కానీ.. అలకనందా అంటే లోకల్ అనుకుంటివా కాదు నేషనల్ అనేది మాత్రం గట్టిగానే సెట్టయింది. హైదరాబాద్‌లోని అలకనంద అనే ఆస్పత్రిలో ఇల్లిగల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఆపరేషన్లు చేస్తూ.. కోట్లలో వ్యాపారం చేస్తున్న కిడ్నీ రాకెట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే.. ఈ కేసుకు సంబంధించిన విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.