కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్ల అభివృద్ధి మీద ప్రత్యేకంగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో అభివృద్ధి, కొత్త సౌకర్యాల కల్పన కోసం భారీ ఎత్తున నిధులు విడుదల చేస్తోంది. ఈక్రమంలో మహబూబ్‌నగర్‌లో ఏళ్ల తరబడి నిర్లక్ష్యంగా వదిలేసిన కృష్ణా రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం ప్రభుత్వం తాజాగా రూ.16 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తంతో రైల్వే స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఆ వివరాలు..