వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఫిబ్రవరి 13న అరెస్ట్ చేశారు. విజయవాడ జైల్లో ఉన్న వంశీని వైఎస్ జగన్ పరామర్శించారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసినట్లు వంశీపై కేసు నమోదైంది. వంశీ అరెస్టును వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అయితే, ఈ విషయంలో పార్టీ నేతలెవరూ మాట్లాడొద్దని జగన్ ఆదేశించారంటూ ఓ ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. ‘వంశీ అరెస్ట్ గురించి మాట్లాడకండి.. వైసీపీ నేతలకు జగన్ ఆదేశం’ అనే శీర్షికతో షార్ట్ న్యూస్ యాప్ ‘వే టు న్యూస్’లో వార్త ప్రచురితమైనట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. సజగ్ టీమ్ దర్యాప్తులో ఈ న్యూస్ క్లిప్ నకిలీదని తేలింది. పూర్తి వివరాలు వీడియోలో..