YSRCP Clarity On Whip To Mps In Rajya Sabha For Waqf Bill: పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపింది. వైఎస్సార్‌సీపీది డబుల్ గేమ్ అంటూ ఏపీలో అధికార కూటమి టార్గెట్ చేసింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఈ అంశంపై స్పందించింది. రాజ్యసభలో తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేశామంటూ ఆధారాలను ట్వీట్ చేసింది.. అలాగే ఈ బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో మాట్లాడిన వీడియోను కూడా ప్రస్తావించింది.