విద్యా శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. విద్యా వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. ఈ క్రమంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రంలో 10 +2 విధానం అమలు చేయాల్సి ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు, మార్పులు చేయాలని ఆధికారులకు ఆయన సూచించారు. హాస్టళ్లు, రెసిడెన్సియల్ స్కూల్స్ కూడా అద్దె భవనాల్లో నడపొద్దని ఆయన తేల్చిచెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని అన్నారు.