విజయవాడను వరుణుడు వదలనంటున్నాడు. భారీ వర్షాలు, వరదలతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయిన బెజవాడ వాసులను మరోసారి వరుణుడు వణికించాడు. శనివారం మధ్యాహ్నం విజయవాడలో భారీ వర్షం కురిసింది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. అటు బుడమేరు వాగుకు పడిన మూడు గండ్లను అధికారులు పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం తగ్గింది. దీంతో ఆయా ప్రాంతాల వాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు.