వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. స్లాబ్ పైకప్పు పెచ్చులు ఊడి పడి పలువురు రోగులు, వారి కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వారిని వెంటనే డాక్టర్లు పరిశీలించి చికిత్స అందించారు. ఈ ఘటనతో వార్డులోని ఇతర రోగులు, వారి సహాయకులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అధికారులు పరిశీలించి.. అక్కడి రోగులను మరో వార్డుకు తరలించారు.