తెలంగాణలో పులుల సంచారం ఎక్కువైపోయింది. ఎక్కడపడితే అక్కడ పులులు అడవులను వదిలి జనసంచారంలోకి వచ్చి హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. వరంగల్‌కు రెండు పులులు, అడవి దున్నలు కూడా వచ్చాయి. అయితే.. అవి.. జనావాసాల్లోకి రాలేదు. హన్మకొండలోని జూ పార్కుకు వచ్చాయి. వాటిని కూడా అధికారులే తీసుకొచ్చారు. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన రెండు పులులు, అడవి దున్నలతో పాటు మిగతా జంతువులను ప్రజల సందర్శనార్థం మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.